19-12-2025 09:03:06 PM
58వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి లోహిత రాజు
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లిలో స్థానిక కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజు ఆధ్వర్యంలో పుల్లూరు నరసయ్య చారిటబుల్ ట్రస్ట్ మెంబర్ నమిండ్ల అజయ్ కుమార్ ద్వారా పేద వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు శుక్రవారం దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం వారు మాట్లాడుతూ... శీతాకాలంలో చలి ఎక్కువగా ఉండటం వలన పేద ప్రజలు ఇబ్బందుల పడుతున్నారు. అందుకు మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అపన్నులకు అండగా ఉడతా భక్తిగా ఉండాలని సదుద్దేశంతో దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి ప్రసంగి, సుదర్శన్, ఫిలిప్స్, ఇమ్మడి సుధాకర్, ప్రభాకర్, నల్ల ప్రశాంత్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.