19-12-2025 09:08:25 PM
కూనూరు సంజయ్ దాస్ గౌడ్
చిట్యాల,(విజయక్రాంతి): ఇటీవల జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో చిట్యాల మండలంలోని నేరడ గ్రామానికి చెందిన ఇండిపెండెంట్ సర్పంచి అభ్యర్థి వీరమల్ల అరుణ్ కుమార్ బరిలో నిలిచి ఓడిన, గ్రామ ప్రజల హృదయాలను గెలిచాడని, ఆయనను శుక్రవారం సన్మానించిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ అన్నారు.
ఆయన మాట్లాడుతూ.. పోటీలో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా 830 ఓట్లు సాధించి అన్ని వర్గాల ప్రజల అభిమాన మద్దతుతో డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు గురి చేయకుండా రెండో స్థానంలో నిలిచి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. విరమల్ల అరుణ్ కుమార్ మాట్లాడుతూ... గ్రామ ప్రజల ఆశీర్వాదం నాకెంతో శక్తినిచ్చిందని నేను ఎల్లప్పుడూ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు జోగు లింగస్వామి, వెల్దుర్తి రాజు, మణికంఠ, మచ్చి తదితరులు పాల్గొన్నారు.