calender_icon.png 24 February, 2026 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాథ శవాలు డంపింగ్ యార్డ్‌కే!

24-02-2026 01:42:43 AM

దహన సంస్కారాల ఊసేలేదు

  1. అనాథ శవాలకు చెత్త సేకరణ వాహనమే వైకుంఠ రథం!
  2. పాలమూరు దవాఖానాలో ఇది మామూలే!
  3. పట్టించుకోని అధికార యంత్రాంగం 

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి) : ఎక్కడో ఒకచోట ఎంతో కొంత దొరికిన కాడికి తిని కాలం వెళ్లదీసే అనాథలపై సమాజం ఎప్పుడూ దయచూపుతూనే ఉంటుంది.. అలాంటి అనా థలే మరణిస్తే దహన సంస్కారాలు పద్ధ తి ప్రకారం నిర్వహించాలనే సోయి అధికార యంత్రాంగానికి కొరవడింది. మని షి జీవించినప్పుడే కాదు.. మరణించినప్పుడు కూడా తగిన గౌరవం ఇవ్వడం అన్ని మతాల్లోనూ ఉంది.

అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడమే మిటి.. గౌరవించడమేమిటి.. అనుకున్నారో ఏమో.. మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో అనాథలు ఎవరైనా మరణిస్తే ఆ శవాలను.. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత చెత్త సేకరణ వాహ నం ద్వారా నేరుగా డంపింగ్ యార్డ్‌కు తరలించి విసిరి పారేస్తున్నారు.

ఏ మతానికి సంబంధించిన వ్యక్తికైనా దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఆ మతపెద్దలకు తెలియజేయాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ ఆ నిబంధనలేవీ అమలుకావడం లేదు. నెలల తరబడి కాదు కదా.. సంవత్సరాల తరబడి కూడా ఆ నిబంధనల ఊసే లేదు. సంబంధిత అధికార యంత్రాంగం బాధ్యతగా పోస్టు మార్టం అనంతరం వైకుంఠ రథంలో శవాలను తీసుకువెళ్లి దహన సంస్కారాలు నిర్వహించాలి. 

మానవత్వం ఎక్కడుంది..

పెంచుకుంటున్న జంతువులు మరణిస్తేనే సంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు నిర్వహించడాన్ని మనం చూస్తున్నాం. అనాథలకు మాత్రం ఆ విలువ దక్కడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా నేరుగా చెత్తను ప్లాస్టిక్ కవర్ లో చుట్టి పారేసినట్టు, అనాథ శవాన్ని కవర్‌లో చుట్టి డంపింగ్ యార్డ్‌లో విసిరివేస్తు న్నారు. దహనసంస్కారాలు సంప్రదాయ పద్ధతిలో జరిగితే చనిపోయినవారి ఆత్మకు శాంతి చేకూరుతుందని ఏ మతంలోనైనా పెద్దలు చెబుతున్నమాట.

మతపెద్దలకు తెలియజేయకుండా, నిబంధనలను గాలికి వదిలి అనాథ శవాలను డంపింగ్ యార్డుకు తరలించడమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా పూర్తిస్థాయిలో, ప్రభుత్వ నిబంధనల మేరకు దహనసంస్కారాలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్‌చేస్తున్నా రు. ఈ విషయంపై జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరిండెంట్ రంగా అజ్మీరాను ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.