1 August, 2026 | 10:33 PM

ఫర్టిలైజర్ షాపుల లైసెన్సులు రద్దు

01-08-2026 09:48 PM

మోతె,(విజయక్రాంతి): అధిక ధరలకు ఎరువులు డి ఏ పి అమ్ముతున్న ఫర్టిలైజర్ షాపుల లైసెన్స్ లు రద్దు చేస్తున్నట్లు శనివారం మండల వ్యవసాయ అధికారి ఎం.అరుణ చెప్పారు. మండల పరిధిలోని అన్నారి గూడెం గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ షాపు యజమాని పోటు వెంకటేశ్వరావు కు చెందిన చేను సెలక ఫర్టిలైజర్ షాపును, మండల కేంద్రానికి చెందిన శ్రీ వెంకటసాయి ఫర్టిలైజర్ ఏజెన్సీ యజమాని కృష్ణ కాంత్ షాపులలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అధిక ధరలకు ఎరువులు డీఏపీలను అమ్మకాలు జరిపినట్లు ఆకస్మిక తనిఖీల్లో వెల్లడి కావడంతో ఇద్దరి డీలర్ల పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండలంలోని ఏ ఇతర ఫర్టిలైజర్ షాపులో అధిక ధరలకు ఎరువులు డి ఏ పి విత్తనాలు అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.