1 August, 2026 | 10:17 PM

బండారు సుక్కమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు

01-08-2026 09:32 PM

తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామానికి చెందిన బండారు సుక్కమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తమ వంతు అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.