calender_icon.png 30 June, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ పుస్తక దినోత్సవం రోజు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

23-04-2025 07:39:41 PM

టేకులపల్లి (విజయక్రాంతి): ప్రపంచ పుస్తక దినోత్సవం కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఇంగ్లీష్, లెక్కలు సబ్జెక్ట్ ల్లో ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్(ISGF) ఆధ్వర్యంలో మండలం బొమ్మనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక పుస్తకాలను పంపిణీ నిర్వహించారు. ఎస్ జి ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు లోగాని శ్రీనివాస్ చేతుల మీదుగా జరిగిన ఈ పంపిణీ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ ఉమెన్స్ గిల్డ్ జిల్లా కో-ఆర్డినేటర్ ఎం.జ్యోతి రాణి, ఇన్చార్జి హెచ్ఎం జరపల పద్మ, ఐఆర్పి టీచర్ నీరజ షారోన్, అంగన్వాడీ టీచర్స్ విజయ లక్ష్మి, విజయ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.