20 August, 2026 | 11:36 PM

ప్రకృతి వైద్యునిగా సుగుణారావు

20-08-2026 11:04 PM

చుంచుపల్లి,(విజయక్రాంతి): గత మూడు సంవత్సరాలుగా ఎన్.డి.డి.వై. వైద్య విద్యను పూర్తి చేసిన, కొత్తగూడానికి చెందిన ప్రముఖ ఆల్టర్నేటివ్ తెరపిస్ట్, జి. సుగుణారావు ప్రకృతి వైద్యునిగా సర్టిఫికెట్ అందుకున్నారు. బుధవారం సాయంత్రం గుంటూరు పట్టాభిపురం లోనే "టెంపుల్ ఆఫ్ హెల్త్ ఇన్స్టిట్యూట్లో " ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డా. ఎస్.కె. హుస్సేన్ చేతుల మీదుగా ఆయన ఈ సర్టిఫికెట్ను అందుకున్నారు.

గాంధీ స్మారక్ ప్రకృతి చికిత్స సమితి ఆధ్వర్యంలోని, గాంధీ నేషనల్ అకాడమీ ఆఫ్ నేచురో పతి (న్యూఢిల్లీ) నుండి, సర్టిఫికెట్ అందుకున్న సుగుణారావుని ఈ సందర్భంగా పలువురు అభినందించారు. సుగుణారావు తో పాటు, కొత్తగూడానికి చెందిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్. బత్తుల కృష్ణయ్య, హైదరాబాద్ కు చెందిన, డా. తూమాట్ల వెంకన్నలు అందుకున్నారు. వీరిని అభినందించిన వారిలో పర్యావరణ వేత్త మొక్కల వెంకటయ్య, పారంపర్య వైద్య మహా సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామంచి శ్రీనివాస్, ప్రధానమంత్రి మన్ కీ బాత్ మొక్కల రాజశేఖర్ ఉన్నారు.