26 June, 2026 | 6:46 PM

Breaking News

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •  

పెళ్లిరోజు... మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

20-04-2026 08:30 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ  రైస్ మిల్ ల వ్యాపారవేత్త, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంక్షేమ సంఘం అధ్యక్షులు నగునూరి అశోక్ రమాదేవి దంపతుల వివాహ మహోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సుల్తానాబాద్ పట్టణంలోని కృష్ణ సాయి మెడికల్ స్టోర్ వద్ద చల్ల ప్యాకెట్లను ప్రజలకు అందజేశారు.

ఎండలు జోరు కావడం పెళ్లి రోజును పురస్కరించుకొని అశోక్ రమాదేవి దంపతులు ఆధ్వర్యంలో మజ్జిగ  ప్యాకెట్లను పంపిణీ చేయడం పట్ల సోమవారం వీక్లీ మార్కెట్ కు వచ్చిన ప్రజలు ఆ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయితు రాజేష్, అల్లంకి శ్రీనివాస్, రామిడి శ్రీనివాస్, బోడ్ల శ్రీనివాస్, అల్లంకి అరుణ్, పల్లా శరత్, చకిలం వెంకటేశ్వర్లు, పల్ల అనిల్, నాగ మల్ల ప్రశాంత్ పలువురు పాల్గొన్నారు.