15-11-2025 12:11:47 AM
నిర్మల్,(విజయక్రాంతి): బాలల దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం అనాధ బాలికల బాలసదనంలో ఉంటున్న పేద పిల్లలకు జిల్లా జడ్జి శ్రీవాణి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దుస్తులను పంపిణీ చేశారు. బాల సదంలో ఉంటున్న పిల్లలతో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు వారితో ప్రత్యేకంగా మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ జడ్జి ఏ అవసరం వచ్చినా తమను కలవాలని వారికి భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులు ఉన్నారు.