calender_icon.png 15 November, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైతన్యపురిలో ఉచిత డయాబెటిక్ శిబిరం

15-11-2025 12:12:50 AM

ప్రాణహిత హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్ (చైతన్యపురి), నవంబర్ 14 (విజయక్రాంతి): ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రాణహిత హాస్పి టల్, చైతన్యపురి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత డయాబెటిక్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో వం దలాది మంది ప్రజలు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.

డాక్టర్‌అశోక్ కుమార్ (జనరల్ మెడిసిన్ డయాబెటాలజిస్ట్), మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్‌వ వైద్య సేవలందించారు.శిబిరానికి వచ్చిన రోగులకు రక్తంలో చక్కెర స్థాయి (బ్లడ్ షుగర్) పరీక్షలు, ఉచిత వైద్య సలహాలు, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.

డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, మధుమేహం గురిం చి అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చని తెలిపారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ రెడ్డి మాట్లాడుతూ, సమాజానికి మెరుగైన వైద్య సేవలను అందించాలనే తమ సంకల్పంలో భాగంగా ఈ శిబిరం నిర్వహించా మని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

డాక్టర్ అనిల్ కుమార్ వైద్య బృందానికి విజయవంతంగా శిబిరాన్ని నిర్వహించిన సిబ్బం దికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో న్యూట్రిషియన్,ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్లు పాల్గొన్నారు.ప్రాణాహిత హాస్పిటల్స్ నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని చైతన్య పురి పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు.