calender_icon.png 15 November, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారులకు పంటను అమ్మి నష్టపోవద్దు

15-11-2025 12:11:39 AM

ఎమ్మెల్యే రామారావు పటేల్

కుంటాల, నవంబర్ ౧౪ (విజయక్రాంతి): రైతుల సంక్షేమమే తన ధ్యేయం, కుంటాల రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని  ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం కుంటాల మండలంలో ని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే దాన్నే విక్రయించి లబ్ధి పొందాలని పేర్కొన్నారు .

మొదటి రకం వరి ధాన్యానికి 2389 రెండవ రకం ధాన్యానికి 2369 మద్దతు ధర కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర లభిస్తుందని రైతులు సద్వినియోగం చేసుకొని లబ్ధి చేకూర్చుకోవాలని తెలియజేశారు. ధాన్యం దళారులకు నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి లబ్ధి పొందాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది ఆత్మ చైర్మన్ సిద్ధం వివేకానంద సొసైటీ చైర్మన్ సట్ల గజ్జరం తాసిల్దార్ వాడే కమల్ సింగ్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ ఆప్కా గజ్జరం యాదవ్ జి.వి రమణారావు పిప్పర వెంగళరావు కేశెట్టి అశోక్ జక్కుల గజేందర్ నాయకులు రైతులు పాల్గొన్నారు.