calender_icon.png 2 December, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థినులకు దుస్తుల పంపిణీ

02-12-2025 01:43:22 AM

హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): ఎక్స్‌ట్రామైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంయు క్త ఫెర్టిలిటీ సొల్యూషన్స్ సహకారంతో సోమవారం వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల గుర్తించిన 100 మం ది బాలికలకు అవసరమైన అంతర్గత దుస్తులను పంపిణీ చేశారు.

పెరుగుతున్న యవతలో సౌకర్యం, గౌరవం, నమ్మకాన్ని పెంపొందించడంలో కీలకమైన ఈ ప్రాథమిక అవసరాన్ని తీర్చడమే ఈ కార్యక్రమ లక్ష్యం. కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ కృతజ్ఞతాభావం, సేవాభావం మరియు సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావన గురించి ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు. డాక్టర్ సంయుక్త రెడ్డి విద్యార్థులతో మాట్లాడి, లక్ష్యసాధనపై సూచనలు ఇచ్చారు.