calender_icon.png 2 December, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ పోటీల్లో ‘నారాయణ’ సత్తా

02-12-2025 01:42:23 AM

-బంగారం, వెండి పతకాలు విద్యార్థుల కైవశం!

హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాం తి): సీబీఎస్‌ఈ జాతీయ స్కేటింగ్ చాంపియన్ షిప్, 6వ ఫెడరేషన్ కుడో కప్- నేషనల్ చాంపియన్ షిప్ 2025 క్రీడా పోటీల్లో నారాయణ విద్యార్థులు అబ్బురపరిచారు. సీబీఎ స్‌ఈ నేషనల్ స్కేటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో నారాయణ స్కూల్స్ మదురైకు చెం దిన మాస్టర్ ఎం తమిళినియన్ (అండర్ -11 విభాగంలో) 500 మీటర్ల ఇన్లైన్ స్కేటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించాడు.

కుడో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఇండియా నిర్వహించిన 6వ ఫెడరేషన్ కుడో కప్- నేషనల్ చాంపియన్ షిప్ 2025లో నారాయణ స్కూల్స్ కటక్‌కు చెందిన విద్యార్థులు అయు ష్ కుమార్ లేంకా (అండర్-12) బాయ్స్, 30 కిలోల విభాగంలో వెండి పతకం, సులగ్న లేంకా (అండర్-15) గర్ల్స్, 54 కిలోల విభాగంలో- వెండి పతకం సాధించారు. విద్యార్థులను నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డా పి. సింధూర నారాయణ అభినందించారు.