calender_icon.png 2 December, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివక్ష తొలగిపోతేనే ఎయిడ్స్ నియంత్రణ

02-12-2025 01:44:31 AM

తెలంగాణ సార్క్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ 

హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): ఎయిడ్స్ అనేది ప్రమాదకరమన వ్యాధి. అవగాహన ఉంటే దాన్ని నియంత్రించడం సాధ్య మవుతుందని డా. అనురాధ జాయింట్ డైరెక్టర్ తెలంగాణ సార్క్ తెలిపారు. ప్రపంచ ఎయి డ్స్ డే సందర్భంగా సోమవారం కామినేని ఆ స్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహనా నడక కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

పలువురు వైద్యులు, వైద్యవిద్యార్థులు,  నర్సిం గ్ సిబ్బంది, సామాన్య ప్రజలు.. మొత్తం 300 మందితో అవగాహన నడక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకృష్ణ రాఘవేంద్ర, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎం.స్వామి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అంజయ్య కనుసాలి, ఆర్గనైజింగ్ ఛైర్పర్సన్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి, ప్రొఫెసర్ డాక్టర్ శ్యాం సుందర్, ప్రిన్సిపాల్ డా. సుధీర్ బాబు పడుగుల్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ జె.హరికృష్ణ, కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పటేల్, ఏఆర్టీ సెంటర్ సీఎంఓ డాక్టర్ పెద్ది రామకృష్ణ, ప్రొఫెసర్ డాక్టర్ పి. రత్నాచారి, డాక్టర్ ఐ. సురేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దాక్షాయని పాల్గొన్నారు.