28-01-2026 04:56:24 PM
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తున్న మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ చాంద్ మియా
గరిడేపల్లి,(విజయక్రాంతి): సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరుపేదలకు వరం లాంటిదని మండలం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాంద్ మియా అన్నారు. బుధవారం మండల పరిధిలోని కీతవారిగూడెంలో లబ్ధిదారులు జుట్టుకొండ రామయ్యకు రూ.60 వేలు,వలిశెట్టి రాజ్యలక్ష్మి రూ.29 వేలు, అయితగాని లక్ష్మి రూ.30 వేలు గడ్డమీది లక్ష్మయ్య రూ. 60 వేలు,గుండు మట్టమ్మ రూ.35 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిత్తలూరి వీరస్వామి,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కీత సోమయ్య,వార్డు సభ్యులు బండారు సైదులు, బండారు అంజయ్య, ముత్తినేని హరిబాబు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.