calender_icon.png 28 January, 2026 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్ కలెక్టరేట్ లో మీడియా సెంటర్ ప్రారంభం

28-01-2026 04:52:02 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్,(విజయ క్రాంతి): ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ లో మీడియా సెంటర్ ను అదనపు ఎస్పీ మహేందర్, అదనపు కలెక్టర్ నగేష్ లతో కలసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్  ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ... ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా మీడియా సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై  మీడియా సెంటర్ ద్వారా  నిఘా పెట్టడం జరుగుతుందని  తెలిపారు.  ఈ కార్యక్రమంలో  ఏ పి ఆర్ ఓ బాబు రావు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.