28-01-2026 04:49:16 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో 100% ఫలితాలను సాధిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. బుధవారం నిర్మల్ మండలంలోని రత్నాపూర్ కాండ్లిలో ప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశంను సందర్శించారు. ఫిబ్రవరిలో మూడో తరగతికి జరగనున్న FLS పరీక్ష కొరకు పిల్లలను సంసిద్ధులను చేయాలని, పిల్లలందరూ తొలిమెట్టు అంత్యపరీక్ష వరకు అన్ని సామర్థ్యాలు సాధించేటట్లు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి నరసయ్య, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు విజయ స్వప్న మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.