calender_icon.png 28 January, 2026 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాబ్ కార్డు హోల్డర్స్ తో మహేష్ గౌడ్ సమావేశం

28-01-2026 04:33:07 PM

హైదరాబాద్: మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు హోల్డర్స్ తో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం అయ్యారు. కొరివిపల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ(Mahatma Gandhi National Employment Guarantee Scheme) పేరును తొలగించడాన్ని నిరసిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్, మాజీ పీసీసీ అధ్యక్షులు హనుమంతు రావు, టీపీసీసీ జనరల్ సెక్రటరీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ కోఆర్డినేటర్లు, పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.