calender_icon.png 28 January, 2026 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు

28-01-2026 05:12:59 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) అఫిడవిట్ వేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ ను కొట్టివేయాలని దానం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, బీఆర్ఎస్ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం లేదని  దానం స్పష్టం చేశారు. తాను 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ భేటీకి తాను వ్యక్తిగత హోదాలో వెళ్లాలని క్లారిటీ ఇచ్చారు.

మీడియా కథనాల ఆధారంగా పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తోందని వెల్లడించారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ లోని అంశాలపై మాత్రమే వివరణ ఇస్తున్నట్లు చెప్పారు. గతంలో కోర్టు తీర్పులను అనుసరించి బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ చెల్లుబాటు కాదన్నారు. అనర్హత పిటిషన్ తర్వాతి పరిణామాలను అనుబంధ సమాచారంగా అంగీకరింవద్దని దానం కోరారు. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.

పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. దానంపై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డికి కూడా నోటీసులు అందజేశారు. ఈ నెల 30వ తేదీన విచారణ నిమిత్తం ఇద్దరు నాయకులను స్పీకర్ ముందు హాజరు కావాలని ఆదేశించారు.