6 June, 2026 | 2:43 AM

పేదలకు అండగా‘ముఖ్యమంత్రి’ సహాయ‘నిధి’

06-06-2026 12:25 AM

64 మంది లబ్ధిదారులకు రూ.21.28 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

కూసుమంచి మండల వాసులకి ‘ముఖ్యమంత్రి సహాయనిధి’ అండ

కూసుమంచి, జూన్ 5 (విజయక్రాంతి): వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) కొండంత అండగా నిలుస్తుందని కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిఫార్సు మేరకు మంజూరైన  64 మంది లబ్ధిదారులకు రూ.21,28000 విలువగల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను కూసుమంచి *ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా శుక్రవారం లబ్ధిదారు లకు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే కాకుండా, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందిస్తూ భరోసా కల్పిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, సీడీసీ చైర్మెన్ ఎర్రబోలు సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ బానోత్ శ్రీనునాయక్, జిల్లా నాయకులు జొన్నలగడ్డ రవి కుమార్, మాజీ ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ ఆయా ప్రాంతాల చెందిన సర్పంచులు, నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.