లబ్ధిదారులకు పట్టాల పంపిణీ
02-09-2025 11:34 PM
రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): క్యాతనపల్లి పురపాలకం రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఆర్కేసీఓఏ క్లబ్ వద్ద మంగళవారం కార్మిక,గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి డబుల్ బెడ్ రూం ఇండ్ల అర్హులైన 230 మంది లబ్ధిదారులకు (ప్రాసీడింగ్) పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల పేదలకు మేలు జరిగిందని అన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల ఉచిత కరెంట్,కొత్త రేషన్ కార్డులు,సన్న బియ్యం పంపిణీ లాంటి పథకాలతో పేదలు లబ్ది పొందుతున్నారని అన్నారు.






