4 August, 2026 | 11:03 PM

యుద్ధ ప్రాతిపదికన రోడ్ సేఫ్టీ డ్రైవ్

03-09-2025 12:00 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్డు భద్రత చర్యలలో భాగంగా గుంతల పూడ్చివేత పనులు, క్యాచ్ పిట్ రిపేర్లు, కవర్ రీప్లేస్మెంట్లు, సెంట్రల్ మీడియన్ మరమ్మతులు నిరంతరంగా కొనసాగుతున్నాయి. సోమవారం కృష్ణా నగర్, నాంపల్లి బంజారాహిల్స్, ఎర్రమంజిల్, జూబ్లీహిల్స్, మచ్చ బొల్లారం, లకిడికపూల్, జవహర్పూర లలో డ్రైవ్ చేపట్టారు.

కొత్త సీసీ రోడ్ల నిర్మాణం తో పాటు గుంతల పూడ్చివేత క్యాచ్ పిట్ లకు రిపేర్ చేశారు. మంగళవారంనాటికి నగరంలో మొత్తం 13,790గుంతలు గుర్తించ గా.. వాటిలో 11,159 గుంతలకు మరమ్మతులు చేశారు. సోమవారం వరకు 10,962 గుంతలను పూడ్చివేయగా, మంగళవారం ఒక్కరోజే 197 గుంతలకు మరమ్మతులు చేశారు. ఇప్పటి వరకు 549 క్యాచ్ పిట్స్ రిపేర్లు, 313 కవర్ రీప్లేస్మెంట్లు, 12 సెంట్రల్ మీడియన్ మరమ్మతులు పూర్తి అయ్యాయి.