22 June, 2026 | 2:06 PM

Breaking News

డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •  

వేమనపల్లిలో ప్రతి గ్రామానికి డీజే సౌండ్ సిస్టం పంపిణీ

10-10-2024 12:45 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవ ప్రతీక సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని గురువారం వేమనపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు మాజీ జెడ్పిటిసి  రుద్ర బట్ల సంతోష్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సాబీర్ అలీల ఆధ్వర్యంలో డీజే సౌండ్ సిస్టం లను పంపిణీ చేశారు. రూ.11 లక్షల 40 వేల విలువగల సౌండ్ సిస్టం బాక్సులను మహిళలకు అందించారు. నాగారం గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ముల్కల సత్యనారాయణ రూ 2 లక్షలతో 6 సెట్ల డిజె సౌండ్ సిస్టం బాక్సులను పంపిణీ చేశారు. నీల్వాయి గ్రామంలో మాజీ సర్పంచ్ గాలి మధు, ముల్కల పేటలో ఒడిలా రాజన్న, కామెర గణేష్, కొత్త కాలనీ, దస్నాపూర్ గ్రామాల్లో మాజీ సర్పంచ్ కుమురం రమేష్, రాజేష్, కొత్తపల్లి, వేమనపల్లి, రాచర్ల గ్రామాల్లో మాజీ సర్పంచ్ తోకల రాoచందర్, మాజీ ఎంపీపీ గురు వెంకటేశం ల ఆధ్వర్యంలో డీజే సౌండ్ సిస్టం బాక్సులను మహిళలకు పంపిణీ చేసి బతుకమ్మ పండుగపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.