25 March, 2026 | 2:34 AM

యాంత్రిక వ్యవసాయానికి డ్రోన్ల పంపిణీ

25-03-2026 01:02 AM

రైతుకు రాయితీపై అగ్రికల్చర్ డ్రోన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే యాదయ్య

చేవెళ్ళ మార్చి 24(విజయక్రాంతి): రైతుకు శ్రమ తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం యాంత్రిక వ్యవసాయం చేసేందుకు డ్రోన్ల పంపిణీచేశారు.చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ యాంత్రికరణ పథకంలో భాగంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (షాబాద్ రైతు ఫుడ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్)కు రాయితీపై అగ్రికల్చర్ డ్రోన్ల పంపిణీ చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పార్టీ నాయకులు రైతులతో కలిసి పంపిణి చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతు సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులు యంత్రికరణ వ్యవసాయంలో ముందడుగు వేయాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు శైలజ ఆగిరెడ్డి, పడాల ప్రభాకర్, నడిమొల్ల శంకర్, చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వార్డు సభ్యులు దావల్గారి గోపాల్ రెడ్డి, నాయకులు పలుగుట్ట జనార్దన్ రెడ్డి, ముడిమ్యాల మాజీ పిఎసిఎస్ చైర్మన్ గోనె ప్రతాపరెడ్డి, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పిసరి సురేందర్ రెడ్డి, కావలి చంద్రశేఖర్ గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్