1 September, 2026 | 6:16 AM

రంగుల పండక్కి నిత్యవసర వస్తువులు పంపిణీ

14-03-2025 12:14 AM

అటవీ గ్రామాలలో సి.ఆర్.పి.ఎఫ్ బలగాలు చేయూత

ఉయ్యలమడుగు మరియు టెకులేరు లో పౌర చర్య కార్యక్రమం

చర్ల,(విజయక్రాంతి): చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లా ఉయ్యలమడ్గు, టెక్లర్ గ్రామం పమేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఆర్పిఎఫ్ 218 Bn కమాండెంట్ మొహమ్మద్ ఖాన్ సమక్షంలో హోలీ పండుగ పురస్కరించుకొని పౌర కార్యాచరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.  గ్రామస్తులకు C/218 Bn సిఆర్పిఎఫ్  ద్వారా నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.  218వ సిఆర్పిఎఫ్ ఏజెన్సీలోని అటవీ గ్రామాల ప్రజలకు అండదండగా ఉంటామని గ్రామాభివృద్ధికి సహకరిస్తామని కమాండెంట్ మహమ్మద్ ఖాన్ గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామస్తులు భవిష్యత్తులో ఎలాంటి సమస్య తలెత్తినా భద్రతాదళాలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు.218 బెటాలియన్ కమాండెంట్ ఈ సందర్భంగా గ్రామస్తులందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా అసిస్టెంట్ కమాండెంట్ సందీప్, పామెడ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నితీష్ కుమార్, సిఆర్పిఎఫ్ సిబ్బంది గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.