1 September, 2026 | 5:30 AM

‘ఖబడ్దార్ సీఎం రేవంత్‌రెడ్డి’

14-03-2025 12:14 AM

శేరిలింగంపల్లి, మార్చి 13 (విజయక్రాం తి): హెచ్‌సీయూ క్యాంపస్ పరిధిలోని 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రేవంత్ ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ, ఖబడ్దార్ సీఎం రేవంత్‌రెడ్డి, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ ప్లకార్డులు చేతబూని విద్యార్థులు నినాదాలు చేశారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సి టీ భూములను అమ్మకానికి పెట్టడంపై విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హెచ్‌సీయూ భూముల అమ్మకాలను వెంట నే నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.