26 June, 2026 | 6:31 PM

Breaking News

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •  

పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ

28-02-2026 09:23 PM

నవాబ్ పేట్: మండలంలోని ఎన్మన్ గండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలల్లో శనివారం పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లను పంపిణీ చేశారు. గోనయో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై (SI) విక్రమ్, ఫౌండేషన్ స్థాపకులు సంతోష్ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు ప్యాడ్లను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో గత రెండు సంవత్సరాలుగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు లక్ష్మీనారాయణ, గణేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.