సురక్షిత డ్రైవింగ్ పై విద్యార్థులకు అవగాహన
28-02-2026 09:26 PM
సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణంలోని మాడ్యులస్ హైస్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రత, సురక్షిత డ్రైవింగ్ పై ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతిరెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ విజయ భాస్కర్, పాఠశాల, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.




