calender_icon.png 26 August, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదులకు రక్షణ చట్టాలు కల్పించాలి

26-08-2025 08:47:07 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): న్యాయవాదులకు రక్షణ చట్టాలు కల్పించాలి అని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని కోర్ట్ ఆవరణలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోమటిరెడ్డి సత్తన్న మాట్లాడుతూ... కూకట్పల్లి బార్ అసోసియేషన్ ఈసీ మెంబరైన న్యాయవాది శ్రీకాంత్ పై జరిగిన దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి, దాడికి గురైన న్యాయవాదికి సంఘీభావం తెలియజేశారు. న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి న్యాయవాది రక్షణ చట్టం కోసం డిమాండ్ చేస్తూ న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.