18 April, 2026 | 11:02 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

భూపాలపల్లి జిల్లాలో 75 శాతం సన్న బియ్యం పంపిణీ

21-06-2025 08:10 PM

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ కార్డు దారులకు 3 నెలల రేషన్ ఒకే సారి పంపిణీ చేయాలన్న లక్ష్యం మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సన్న బియ్యం పంపిణీ 75 పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ అశోక్ కుమార్(Additional Collector Ashok Kumar) తెలిపారు. జిల్లాలోని 277 రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయడానికి ఇప్పటివరకు 6746.616 మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ షాపుల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. బియ్యం తీసుకోకుండా మిగిలిన లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా  తీసుకోవాలని, చౌక దుకాణాల్లో స్టాకు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఒకేసారి 3 నెలల రేషన్ సన్న బియ్యం పంపిణీ జూన్, జులై, ఆగస్టు మాసాలకు సంబంధించిన రేషన్ సన్న బియాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ చౌక ధరల దుకాణాల ద్వారా ఈ నెల  ప్రారంభించగా జిల్లాలోని 277 రేషన్ షాపుల్లో ఇప్పటి వరకు 6746.616 మెట్రిక్ టన్నులు సన్న బియ్యంను చౌక ధరల దుకాణాల్లో అందుబాటులో ఉంచడం ద్వారా భూపాలపల్లి జిల్లా రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉన్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. రేషన్ కార్డు దారులకు ఎలాంటి ఇబ్బందుల కలుగకుండా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.