12-11-2025 06:11:33 PM
సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి..
చిట్యాల (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ద్వారా మంజూరైన ఉచిత చేప పిల్లలను చిట్యాల మండలంలోని వివిధ గ్రామాల మత్స్య కార్మిక సొసైటీలకు సుమారు 11 లక్షల చేప పిల్లలు (బొచ్చ, రవ్వ, బంగారు తీగ)ను జిల్లా మత్స్య సహకార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి చేప పిల్లలను మత్స్య పారిశ్రామిక సొసైటీ అధ్యక్షులకు బుధవారం అందజేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలనలో భాగంగా ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి మత్స్య కార్మికుల సంక్షేమం కోసం, ఆర్థిక అభివృద్ధి పురోగతికై ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడం గొప్ప పరిణామమని, నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం పిల్లాయిపల్లి కాలువ, దర్మారెడ్డి పల్లి కాలువ ద్వారా చెరువులను నింపుటక అహర్నిశలు కృషి చేసారని ఎమ్మెల్యేకి రైతులు, మత్స్య కారుల పక్షాన ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ డివిజన్ ఫీల్డ్ ఆఫీసర్ చింతారెడ్డి ప్రియాంక, రేణుక ,అలీ, వివిధ గ్రామాల మత్స్య పారిశ్రామిక సొసైటీల అధ్యక్షులు వెలిమినేడు కావలి శ్రీనివాస్, చిన్నకాపర్తి ఉప్పరబోయిన స్వామి, పెద్దకాపర్తి-బుంగపట్ల తిమ్మయ్య, తాల్లవెల్లంల-నీలం లింగస్వామి, ఉరుమడ్ల-బోయ నరసింహ, గుండ్రాంపల్లి-అన్నెబోయిన రమేశ్ తదితరులు పాల్గొన్నారు.