రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు
08-03-2026 02:06 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ
తాండూరు,(విజయక్రాంతి): రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తూ ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించవద్దని వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ అన్నారు. ఆదివారం ఆమె కమిషనర్ మధుసూదన్ రెడ్డితో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు.
పాత మున్సిపల్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న చిరు వ్యాపారులతో ఆమె మాట్లాడారు. రోడ్లపైకి వచ్చి దుకాణాలు పెట్టడం వల్ల అంబులెన్స్ కానీ, ద్విచక్ర వాహనదారులకు, పాదాచారులకు గాని ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వివరించారు. రేపటి నుంచి రోడ్లపై పెట్టొద్దని పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంకా వారి వెంట మేనేజర్ నరేందర్ రెడ్డి, సిబ్బంది రమేష్ సుభాష్ తదితరులు ఉన్నారు.




