12-11-2025 06:08:50 PM
నకిరేకల్ (విజయక్రాంతి): ఈ నెల 17న యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో నిర్వహించనున్న సదర్ సమ్మేళనం కార్యక్రమం పోస్టర్ ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అవిష్కరించారు.
మట్టపల్లి మృతికి సంతాపం
మండలంలోని మార్రూర్ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ బరిశెట్టి మట్టపల్లి (నరేందర్ బాబు) అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.