8 March, 2026 | 3:50 PM

శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

08-03-2026 02:02 PM

 పాల్గొన్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ,(విజయక్రాంతి): శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ చింతపల్లి మండలంలోని గోడుకొండ్ల, వెంకటేశ్వర నగర్ (మాల్) గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ... శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు దేవరకొండ ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని,

స్వామి దయా కరుణా కటాక్షాలతో దేవరకొండ శాంతి, సుభిక్షాలతో మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.