సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026
కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో బుధవారం జాతీయ డాక్టర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్.కిరణ్ రాజ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్.కిరణ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ, ప్రముఖ వైద్యులు, స్వాతంత్ర్య సమరయోధులు అయిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ (డాక్టర్ బి.సి. రాయ్) జయంతి మరియు వర్ధంతి సందర్భంగా ఆయన అందించిన వైద్య సేవలను గుర్తించిన ప్రభుత్వం 1991 నుండి ప్రతి ఏడాది జులై1వ తేదీ ని మన దేశం లో డాక్టర్స్ డే గా జరుపుకుంటున్నామని, “మాస్క్ వెనుక: వైద్యులను ఎవరు బాగుచేస్తారు/ఆదుకుంటారు”
("Behind the Mask: Who Heals the Healers") అనే నినాధం తో ఈ ఏడాది జాతీయ డాక్టర్ల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం అని, వైద్యుల అంకితభావాన్ని, వారి త్యాగాలను మరియు నిరంతర శ్రమను గుర్తించడానికి గుర్తుగా ఈ నినిదాన్ని ఎంచుకున్నారని తెలిపారు. 'వైద్యో నారాయణో హరి' అన్నది భారతీయ సంస్కృతి అని, ప్రాణం పోసేది బ్రహ్మ అయితే.. పునర్జన్మ నిచ్చేది వైద్యులు.. అని అన్నారు. వైద్యుడు దేవుడితో సమానం అని కనిపెంచిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పించే గురువు తర్వాత దేవుడిగా భావించేది వైద్యుడినే అని పునరుద్ఘాటించారు. రోగికి ప్రమాదకరంగా ఉంటే ఏ సమయమైనా ఆస్పత్రికి చేరుకొని చికిత్స అందిస్తున్నందుకు సింగరేణి డాక్టర్లను అభినందించారు.
సింగరేణి సంస్థ కార్మికుల,కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని,సింగరేణి యాజమాన్యం ఎక్కడా కూడా ఖర్చుకు వెనుకాడక అత్యుత్తమ రీతిలో వైద్యం, పౌష్టికాహారం అందిస్తుందని, కార్మికులు,కుటుంబ సభ్యులు త్వరితగతిన కోలుకునే విధంగా అన్ని ఏర్పాట్లను చేస్తుందని తెలియజేశారు. సింగరేణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ డా. బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఐఏఎస్ మరియు డైరక్టర్(పా) శ్రీ గౌతమ్ పొట్రు,ఆదేశాల సింగరేణి వ్యాప్తముగా అన్ని ఆసుపత్రులలో అన్ని రకాల సౌకర్యాలనుమెరుగుపరచుకున్నామని, స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించుకున్నామని, మన దగ్గరనే కార్మికులకు మెరుగైన వైధ్యాన్ని మన దగ్గరే అంధించాలని తెలిపారు.
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్లు అందరూ పతిజ్ఞ చేశారు. అనంతరం ఉత్తమ సేవలందించిన డాక్టర్ ఎం ఉష, కె.నాగరాజు, సిహెచ్.రాజ శేఖర్, ఎస్.శ్రీనివాస రెడ్డి సన్మానించి ప్రశంషా పత్రాలను అందజేశారు. అనంతరం సింగరేణి ప్రధాన ఆసుపత్రి డాక్టర్లు అందరూ కలిసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్.కిరణ్ రాజ్ కుమార్ గారిని సన్మానించారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్.కిరణ్ రాజ్ కుమార్ గారు సింగరేణి ప్రధాన ఆసుపత్రిలోని రోగులందరికి పండ్లను అందించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్.కిరణ్ రాజ్ కుమార్, ఏసిిఎంఓ లు శ్రీమతి ఎం.ఉష, శ్రీమతి జి.సునీల, గైనకాలజిస్ట్ మాలతి, పి.శేషగిరి రావు, డిజిఎం వై వి ఎల్ వరప్రసాద్, ఇతర వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.






