21 August, 2026 | 4:10 PM

ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉద్యోగులకు భద్రత కల్పించాలి

21-08-2026 03:06 PM

బోథ్. ఆగస్ట్ 21 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు భద్రత కల్పించాలని మండలంలోని ప్రైవేట్ విద్యాసంస్థల ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ర్యాలీగా తరలివచ్చిన ప్రైవేటు ఉపాధ్యాయులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి జూనియర్ అసిస్టెంట్ భీమ్రావుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మనూరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ రూప రెడ్డి హత్యకు సంబంధించిన కేసును ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలన్నారు.. అనేక విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులపై దాడులు బెదిరింపులు జరుగుతున్నాయని, మాదకద్రవ్యాల వినియోగం అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. విద్యా సంస్థల యాజమాన్యాలు, పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో భద్రత వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో వేద సన్ షైన్ యూటర్న్ విజ్ఞాన్ పాఠశాల ఉపాధ్యాయులు యాజమాన్యం పాల్గొన్నారు.