calender_icon.png 14 January, 2026 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే సహించం

13-01-2026 11:57:42 PM

డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

వాంకిడి,(విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పేదల పొట్ట కొడుతోందని  ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వాంకిడి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఆమె పర్యటించి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల పక్షానే ఉంటుందని ఈ సందర్భంగా ఆమె భరోసా ఇచ్చారు.

అనంతరం మండల కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన నాయకుల సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ–రామ్ జీ చట్టం వల్ల గ్రామీణ కూలీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉధృత పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ పోరాటాల్లో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొని ప్రజల్లోకి వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.