calender_icon.png 5 June, 2025 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్లు లేని అర్హులకు మొండి ''చేయి"

03-06-2025 09:16:51 PM

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు(MLA K.R. Nagaraju), జిల్లా కలెక్టర్ ప్రావీణ్య(District Collector Pravinya), డిస్కబ్ చైర్మన్ రవీందర్రావులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తుండగా గ్రామస్తులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ నాయకులను నిలదీసి ఇల్లు ఉన్నవారికి ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ వాళ్లకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని, నిజమైన అర్హులకు ఇవ్వడం లేదని, ఇల్లు లేని ప్రజలకు మొండి 'చేయి' చూపారని కాంగ్రెస్ నాయకులను నిలదీసినారు.