కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
28-04-2026 12:13 AM
మునిపల్లి, ఏప్రిల్ 27 : మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 86 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబార్ చెక్కులను సోమవారం రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి అధికారులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పేదల ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రంగారావు, ఎంపీడీఓ అంజయ్య, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ బుర్కల పాండు, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరన్న పాటిల్, సంగన్న, నరేందర్ గౌడ్, నాగేష్, గుడ్డు పటేల్, సర్పంచులు గుజ్జరి ప్రభుదాస్, బుడ్డ మల్లేశం, కోల్కుంద మల్లేశం, వీరేశం, ఆనందం, రాధాబాయి జోషి పాల్గొన్నారు.






