28 April, 2026 | 2:20 AM

తూప్రాన్ పట్టణంలో బీఆర్‌ఎస్ జెండా ఆవిష్కరణ

28-04-2026 12:14 AM

తూప్రాన్, ఏప్రిల్ 27: బీఆర్‌ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా సోమవారం తూప్రాన్ మండలం లోని వెంకటరత్నాపూర్, గుండ్రెడ్డిపల్లి తో పాటు, తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ చేసిన బీఆర్‌ఎస్ శ్రేణులు. ఇందులో మున్సిపల్ అధ్యక్షులు సతీష్ చారి, బిఆర్‌ఎస్ నాయకులు మన్నె శ్రీనివాస్, చంద్రారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మల్లికార్జున గౌడ్, వెంకట రత్నాపూర్ నాయకులు వెంకటరామిరెడ్డి, గుండ్రెడ్డి పల్లి నాయకులు రాజిరెడ్డి, బి ఆర్ ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

వెల్దుర్తి..

వెల్దుర్తి, ఏప్రిల్ 27 : బి ఆర్ ఎస్ ఆవిర్భవ  దినోత్సవ వేడుకలు వెల్దుర్తి మండలంలో బీఆర్‌ఎస్ నాయకులు సోమ వారం ఘనంగా నిర్వహించారు. వెల్దుర్తి పట్టణంలోని బిఆర్‌ఎస్ పార్టీ  పట్టణ అధ్యక్షుడుజెగ్గ అశోక్ గౌడ్ జెండా  ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.