11-11-2025 07:05:25 PM
కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు..
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు సమక్షంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొనీ భద్రాచలం మండలంలో 27 కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుపేద కుటుంబాలు వివాహాలు చేసుకొని ఇబ్బందులు పడకూడదని ముందస్తు ఆలోచనతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అందజేయడం జరుగుతుందనీ, నియోజకవర్గ ప్రజలు పథకాలను వినియోగించుకోవాలని కోరారు. చెక్కులు అందుకున్న కుటుంబ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.