11-11-2025 06:54:36 PM
డిగ్రీ కాలేజీ ఇంచార్జీ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్..
కాటారం/మహాదేవపూర్ (విజయక్రాంతి): భారతదేశ విద్యా శాఖ తొలి మంత్రిగా నియమితులైన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విద్య ద్వారానే దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రహించి, విద్యారంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి, అట్టడుగు వర్గాల వారికి సైతం విద్యను అందించాలనే సంకల్పంతో ప్రణాళిక బద్ధమైన విద్యా వ్యవస్థను రూపొందించిన మహోన్నత వ్యక్తిగా పేర్కొంటూ "భారతరత్న" మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ సేవలను డిగ్రీ కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపల్ డాక్టర్ డి.శ్రీనివాస్ కొనియాడారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ జయంతి (జాతీయ విద్యా దినోత్సవ) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన కాలంలో దేశంలో విద్యా వ్యవస్థ కేవలం అగ్రవర్ణాల వారికి మాత్రమే అందుబాటులో ఉన్నదని, దేశంలో అత్యధిక వర్గంగా ఉన్నటువంటి సామాన్యులకు విద్య అందని ద్రాక్ష గానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆజాద్ ఆశయాలను ముందుకు తీసుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఆధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు.