11 August, 2026 | 2:02 AM

సీపీఐ మహాధర్నా కరపత్రాల పంపిణీ

11-08-2026 12:37 AM

ఘట్ కేసర్, ఆగస్టు 10 (విజయ క్రాంతి) : ఘట్కేసర్  సర్కిల్, పోచారం డివిజన్ అన్నోజిగూడలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో  సోమవారం సిపిఐ పార్టీ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్, సహాయ కార్యదర్శి సయ్యద్  ఖదీర్, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు జయచంద్ర సిపిఐ మహాధర్నా కరపత్రాలను గడపగడపకూ అందజేశారు.

అనంత రం ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు జయచంద్ర మాట్లాడుతూ మనదేశంలో ప్రజా స్వామ్యాన్ని బ్రతికించుకొనుటకు సిపిఐ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌదరి,  సత్యనారాయణ, సయ్యద్ అలీ, రామచంద్ర, శంకరయ్య, రామ్ కుమార్, పాషా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.