11 August, 2026 | 2:50 AM

ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

11-08-2026 12:38 AM

కొందుర్గు, ఆగస్టు 10 (విజయక్రాంతి): మండల కేంద్రంలో చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కక్కునూరు వెంకటేష్ గుప్తా ముఖ్యఅతిథిగా హాజరైనారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాట్లాడుతూ ప్రతి భారతీయుడిలో దేశభక్తి, జాతీయ ఐక్యత, సమైక్యతా భావాన్ని మరింత బలోపేతం చేయడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలి& ప్రతి గుండెలో భారతదేశం నిలవాలి. ప్రతి కార్యకర్త తమ ఇళ్లపై జాతీయ జెం డాను ఎగురవేసి ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు.