25 June, 2026 | 2:06 AM

మహిళాశక్తి చీరల పంపిణీ

25-06-2026 01:07 AM

ఘట్ కేసర్, జూన్ 24 (విజయక్రాంతి): ఘట్ కేసర్ డివిజన్ పరిధిలోని ఎన్.ఎఫ్.సి నగర్, ఘట్ కేసర్, కొండాపూర్ లలో మహిళా గ్రూపుల లోని ఆడపడుచులకు బుధవారం కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మామిండ్ల ముత్యాల్ యాదవ్, ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్, ఎస్సీ సెల్ బిబ్లాక్ ప్రధాన కార్యదర్శి మేకల సునీల్ కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  ఓర్సు విజయ్ కుమార్, ఎం.రామస్వామి, నాయకులు కడపోల్ల రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.