23 August, 2026 | 8:49 PM

మానసిక వికలాంగ విద్యార్థులకు భోజన వితరణ

23-08-2026 08:14 PM

ఘట్ కేసర్, ఆగస్టు 23 (విజయక్రాంతి) : మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ  ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు సమీపంలోని మానసిక వికలాంగుల విద్యార్థి కేంద్రంలో ఆదివారం విద్యార్థులకు భోజనం వితరణ చేసారు. జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానుల మధ్య   ఘనపురం పవర్ గ్రిడ్ వద్ద వారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

జన్మదిన వేడుకలకు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి  సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, ఘట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, జిల్లా కార్యదర్శి ముత్యాలుయాదవ్, ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి, ఎదులాబాద్  డివిజన్ అధ్యక్షులు సామల ఆమరేందర్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మీసాల మల్లేష్, మాజీ సర్పంచ్ లు ననావత్ రూప్ సింగ్ నాయక్, బద్దం గోపాల్ రెడ్డి, వెంకటేష్ ముదిరాజ్, మాజీ ఎంపీటీసీలు కందుల కుమార్, మాజీ కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్, మాజీ ఉపసర్పంచ్ లు, వేముల సత్తయ్య గౌడ్, వేముల పరమేష్ గౌడ్, కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ మెరుగు నరేష్ గౌడ్, కీసర గుట్ట దేవస్థానం డైరెక్టర్లు సగ్గు అనీత, కాంగ్రెస్ నాయకులు గాయరు విశ్వనాధం, కవాడి మాధవరెడ్డి, బర్ల రాధాకృష్ణ, ఖయ్యూం, కందకట్ల మాధవరెడ్డి,  బండ్లగూడెం నాగేష్ గౌడ్, బొక్క సంజీవరెడ్డి, వేముల గోవర్ధన్ గౌడ్, గుర్జకుంట నర్సింహా, మెట్టు రమేష్, మెట్టు నర్సింహా, బద్దం నర్సింహా రెడ్డి, వేముల రాజు గౌడ్, వేముల శంకర్ గౌడ్, ననావత్ సురేష్ నాయక్, వేముల వినోద్ గౌడ్, వేముల వెంకటేశం గౌడ్, కట్కూరి భాను గౌడ్,  ఘనపురం నేతాజీ యువజన సంఘం సభ్యులు, శాలువాలతో, సన్మానించి, కేక్ కట్  చేయించి తమ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.