23 August, 2026 | 8:42 PM

మైనార్టీ మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అండ

23-08-2026 08:09 PM

చొప్పదండి ఎమ్మెల్యే సత్యం

కొడిమ్యాల, ఆగస్టు 23 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన రేష్మ,షాబాన బేగం లకు ఇందిరా మైనార్టీ మహిళా యోజన పథకం కింద 100% సబ్సిడీతో మంజూరైన యాభై వేల  రూపాయల చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదివారం లబ్ధిదారులకు  అందజేశారు.మైనార్టీ మహిళల ఆర్థిక సాధికారత,స్వయం ఉపాధికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని సత్యం తెలిపారు.ఈ కార్యక్రమంలో కొడిమ్యాల సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ మెన్నేని రాజనర్సింగరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోగురి భూషణ్ రెడ్డి పాల్గొన్నారు.