23 August, 2026 | 8:49 PM

అమ్మవార్ల దయ జవహర్ నగర్ ప్రజలపై ఉండాలి

23-08-2026 08:11 PM

మేడ్చల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జి మహేందర్ రెడ్డి.                   

జవహర్ నగర్,ఆగస్టు 23 (విజయక్రాంతి): అమ్మలగన్న అమ్మలు విశ్వభారత శక్తి స్వరూపిణులు ముగ్గురమ్మల మూలపుటమ్మలు స్వరూపిణులు, ఆ పోచమ్మ మారమ్మ పోలేరమ్మ ఎల్లమ్మ, మైసమ్మ, ఉప్పలమ్మ, కాలిక సింహ వాహిని మాత లేనని మేడ్చల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి జవహర్ నగర్ లోని వివిధ ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని, భక్తి భావానికి శక్తి భావానికి అవినాభావ సంబంధం ఉందని భక్తి భావంతోనే ఏదైనా సాధించవచ్చునని తెలిపారు.

తల్లుల దీవెనలు జవహర్ నగర్ ప్రజల పైనే కాక యావత్ తెలంగాణ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అమ్మవార్ల దయతోనే సకాలంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. అనంతరం జవహర్ నగర్ లోని వివిధ ప్రాంతాలలో కొలువై ఉన్న అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాల స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, జిట్టా శ్రీనివాసరెడ్డి, కొండల్, వివిధ పార్టీ నాయకులు, భక్తులు ప్రజలు పాల్గొన్నారు