17-01-2026 04:16:10 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని చింతలఠాణ గ్రామంలో సర్పంచ్ గుర్రం అనసూర్య మహేందర్ గారి ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టల మందు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ సాగర్ పాల్గొని పశువులకు నట్టల మందును అందజేశారు.
పశువుల ఆరోగ్య సంరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూయిని ఆరు సతి, గ్రామస్తులు, పశుపోషకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామంలో పశుసంపద అభివృద్ధికి ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని సర్పంచ్ అనసూర్య మహేందర్ తెలిపారు.