calender_icon.png 13 February, 2026 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దండిగా కాసుల పంపిణీ!

13-02-2026 12:38:40 AM

భారీగా క్రాస్ ఓటింగ్..?

మహబూబాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మునుపెన్నడు లేని విధంగా ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ పదవులతో పాటు చైర్మన్ పదవులను ఆశిస్తూ పోటీకి దిగిన అభ్యర్థులు దండిగా ఓట్లకు నో ట్లు పంచడంతో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. అధికార కాం గ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు, చివరకు కొన్నిచోట్ల వా మపక్ష పార్టీల అభ్యర్థులు కూడా ఓటర్లకు ఈ సారి భారీగానే ఓటుకు నోట్లు పంచినట్లు ప్ర చారం సాగుతోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 పురపాలక సంఘాల్లో 260 వా ర్డు కౌన్సిలర్ పదవులకు బుధవారం ఎన్నికలు నిర్వహించారు. 260 వార్డు కౌన్సిలర్ పదవులకు 1,072 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో కనీసం 700 నుండి 80 0 మంది అభ్యర్థులు తక్కువలో తక్కువ వె య్యి నుండి గరిష్టంగా 7,000 వరకు ఒక్కో ఓటుకు పంచినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమానికి తెర లేపారు. అప్పటి నుండి మొదలుకొని ప్రతిరోజు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా విధాలుగా ప్రయత్నాలు నిర్వహించారు.

చివరకు పోలింగ్ రోజుకు ఒకరోజు ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు ఇతర అభ్యర్థులు కూడా ఎన్నికల్లో గెలవడానికి దండిగా డబ్బులు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వెళ్ళు వెత్తాయి. ఒక ఇంట్లో రెం డు నుంచి పది ఓట్ల వరకు ఉండగా తక్కువలో తక్కువ 10,000 నుండి లక్ష రూపా యల వరకు ఆ ఇంటికి పోటీలో ఉన్న అభ్యర్థులు డబ్బులు ముట్ట చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. దీనితో ఓటర్లు తమకు డబ్బు లు ఇచ్చిన అభ్యర్థులకు గంపగుత్తగా ఓట్లు వేయకుండా.. ఇచ్చిన డబ్బులకు సమన్యాయం చేయాలని తలచి తలా ఒకటి చొప్పున వేసినట్లు చర్చ సాగుతోంది.

పాపం.. వద్దన్నా అందరూ డబ్బులు, మందు, చికెన్, చీరెలు ఇచ్చి వెళ్లారు.. అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఒక్కరికే ఓట్లు వేస్తే అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కదా.. అందుకే నచ్చిన పార్టీ, అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వేసి, మిగిలిన వారికి కూడా తలా ఒకటి వేసినట్లు చెప్పుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. దీనితో క్రాస్ ఓటింగ్ భారీగానే జరిగినట్లు ప్రచారం సాగుతోంది. ఫలితంగా ఇప్పుడు ఎవరు సునాయాసంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేయలేకపోతున్నట్లు ప్రచారం సాగుతోంది. క్రాస్ ఓటింగ్ ఎవరి కొంప ముంచుతుందోననే గుబులు ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థులను పట్టిపీడిస్తోంది.

వార్డు కౌన్సిలర్ పదవులతో పాటు ఇక చైర్మన్ రిజర్వేషన్ అనుకూలంగా ఉన్న వార్డుల్లో కౌన్సిలర్ గా పోటీ చేసిన వారు గెలుపును మరింతగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆయా స్థానాల్లో నోట్ల పంపిణీ మరింత ఎక్కువ సాగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటు తమ గెలుపుతో పాటు, కౌన్సిల్ చైర్ పర్సన్ పదవి కోసం తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లను గెలిపించడానికి అటు పార్టీ నుండి ఇటు సొంతంగా భారీగా ఖర్చుపెట్టినట్లు ప్రచారం సాగుతోంది. 

స్వల్ప ఓట్ల తేడాతోనే విజయం!

మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని స్థానాల్లో హోరాహోరీ పోరు నడిచింది. అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులకు తోడు పనిచోట్ల వామపక్ష పార్టీల అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇచ్చారు. పైసల పంపిణీతో మొదలుకొని కానుకలు, ప్రచారం నిర్వహించడంలో కూడా ఏమాత్రం తగ్గకుండా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగించారు. 

దీనితో కౌన్సిలర్ గా ఎవరు గెలిచినా స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఎవరు కూడా పోటీలో వెనక్కి తగ్గకుండా డబ్బులు పంపిణీ చేయడంతో గంపగుత్తగా ఎవరికి కూడా పెద్దగా ఓట్లు పడే అవకాశం లేదని, దీంతో పోటీ నువ్వా నేనా అనే తరహాలోనే సాగిందనే విమర్శలు వస్తున్నాయి.